అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయం నందు సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపికై 30 సంవత్సరాల అయిన సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు నేటికి ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలతో కలిసి ప్రత్యేకంగా కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగిందని సీఎం చంద్రబాబు విజన్ ఉన్న గొప్ప నాయకుడని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.