ఆదివాసీ ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఇంద్రవెల్లిలో నివాసాలా కూల్చివేతతో గిరిజనేతరులు ఆందోళన చేపట్టారు.స్థానిక మార్కెట్ యార్డ్ కు ఎదురుగా ఉన్న నాలాపై నిర్మించిన నివాస గృహంతో పాటు పక్కనే ఉన్న కొన్ని ఇళ్లను బుల్డోజర్లతో అధికారులు శనివారం కూల్చి వేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత గిరిజనే తరుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అధికారుల తీరును నిరసిస్తూ ప్రధాన రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టారు. దశాబ్దాల తరబడి గిరిజనులతో కలిసి జీవనం సాగిస్తున్న పేద మధ్యతరగతి గిరిజ నేతరుల ఇళ్లను కూల్చివేసి ప్రభుత్వం తమపై కక్షసాధింపుచర్యలు చేపడుతుందని విమర్శించారు.