కావలి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం టీచర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని అన్నారు. ఒక మనిషి జీవితాన్ని మార్చేది చదువు అయితే, ఆ చదువును నేర్పించే ఉపాధ్యాయులు దేవుళ్ళతో సమానమని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది.