బతుకమ్మ పండుగ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పలు కాలనీల్లో ఆదివారం బతుకమ్మ పండుగ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. హుస్నాబాద్ ఆడపడుచులకు తెలంగాణ అక్కా చెల్లలకు తొలి రోజు బతుకమ్మ ఆడుతున్న సందర్భంగా ప్రభుత్వం పక్షాన ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు పండగ సందర్భంగా మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్న 9 రోజుల పాటు ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు జరిగే పండగకు అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం