కాకినాడ జిల్లా సామర్లకోట మండల రెవెన్యూ కార్యాలయం నందు తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన SHO కృష్ణ భగవాన్, మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య మరియు సామర్లకోట మండలంలోని టౌన్ మరియు అన్ని గ్రామాల లోని గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులతో బుధవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా. ఈ నెల 4 మరియు 6 వ తేదీలలో జరుగనున్న నిమజ్జనోత్సవాలలో ఎట్టి అపశ్రుతులు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొనవల్సినదిగా సూచనలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు.