వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ ఆధ్వర్యంలో గురువారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట గ్రామంలో “ఓటు చోరీ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రేరణ పొంది, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు,ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కలికోట గ్రామంలోని 87 బూత్‌లలో గడప గడపకు వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలించారు.ఓటర్ వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేసినట్టు తెలిపారు.