కోడలు తో పాటు మనవరాలని ఇంటి నుంచి బయటకు ఘటన సుందరగిరి గ్రామంలో చోటుచేసుకుంది.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో కోడలి సామాగ్రి బయటపడేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు మండల ఎస్ ఐ సాయి కృష్ణ సోమవారం తెలిపారు. సుందరగిరి గ్రామానికి చెందిన స్రవంతి అనే మహిళ గత కొంతకాలంగా భర్త శ్రీహరి తో విభేదాలు కొనసాగుతున్నాయి. భర్త శ్రీహరి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా హైదరాబాదులో విధులు నిర్వహిస్తు అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన ప్రతిసారి భార్య భర్తలు గొడవ పడేవారు. ఆదివారం తన ఇంట్లో ఉండవద్దు అంటూ అత్త విజయలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు తోసేసి సామాగ్రియం కూడా బయటపడేసింది