డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అల్లూరులో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.