కదిరి మండలం కుటాగుల్ల వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ముదిగుబ్బ మండలం నాగుల గుబ్బకు చెందిన మద్దన్నగారి రామాంజనేయులు అనే యువకుడు కదిరిలో జరుగుతున్న శుభకార్యానికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఎదురుగా మరొక యువకుడు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రామాంజనేయులు మృతి చెందాడు.