పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నగరంలో నిరసన తెలిపారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మనవహరం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక మాట్లాడుతూ.. ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులతో చెలగాటం ఆడడం సరికాదు అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8148 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.