వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఎన్నికలు గ్రామంలో ఉన్న గోదాం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజామునుండే బారులు తీరారు. పంటలేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం సుమారు ఒంటిగంట వరకు రైతులు యూరియా కోసం పడిగాపులు కాసారు. యూరియా వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు గోదాం దగ్గరకు చేరుకొని క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడ్డారు.