అర్హులైనప్పటికీ మాకు పింఛను తొలగించారని వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ముట్టడికి తరలివస్తుండగా వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వికలాంగులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. పింఛన్లు తొలగించారని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసేందుకు వస్తుంటే పోలీసులు ఇలా మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఏళ్ల తరబడిగా అర్హులమైన మేము పించిన పొందుతున్నామని, ఏవో కారణాలు చూపి ఇప్పుడు పింఛను తొలగిస్తే మేము ఏ విధంగా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు.