ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామ సమీపంలోని పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పాదముద్రలు గుర్తించిన స్థానికులు ఆందోళన చెంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలు పరిశీలించారు. అవి పెద్దపులి పాద ముద్రలేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఒంటరిగా ప్రజలెవరు ఇటువైపు రావద్దని అంతేకాకుండా పెద్దపులి సంచారాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గురువారం సాయంత్రం 5 గంటలకు వెల్లడించారు. పెద్దపులి సంచారంతో స్థానిక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.