గత బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు 15 శాతం వైన్స్ టెండర్లలో అవకాశం కల్పించడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కంటే ఎక్కువ టిక్కెట్లు కేటాయిస్తామని హరీష్ రావు తెలిపారు. ఈ ప్రభుత్వం కల్తీ కల్లు లేకున్నా గీతా కార్మికులను జైల్లో పెడుతున్నారని విమర్శించారు.