పటాన్చెరు డివిజన్ పరిధిలోని గాంధీ సర్కిల్ నుండి గోనెమ్మ దేవాలయం వరకు చేపడుతున్న రహదారి విస్తరణ, సిసి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం MLA గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. కోటి 40 లక్షల అంచనా వ్యయంతో CC రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారిని విస్తరిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని పాత కాలనీలో నూతన CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.