రంగారెడ్డి జిల్లాలో వనమహోత్సవం, మహిళా శక్తి, వర్షాకాలంలో ప్రభులే సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ శశాంక్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలోనే మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులను నివారణకు మందులు అందుబాటులో ఉంచాలన్నారు.