తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం లో జనసేన పార్టీ తరఫున ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రంగం రెడీ అయింది. 2024 లో రానున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు తమ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే జనసేన ప్రచార రథం నిడదవోలులో అడుగు పెట్టింది. ఈ ప్రచార రథం వద్ద జనసైనికులు సెల్ఫీలు దిగుతూ సంబరపడుతున్నారు.