ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్దీకరణ హామీని నిలుబెట్టుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. బుదవారం సమగ్ర ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను చాయ్ తాగేంతా సమయంలో పరిష్కరిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎడాది గడుస్తున్నప్పటికీ ఇంతవరకు చాయ్ తాగటం లేదా ప్రశ్నించారు. హామీలపై పొంతనలేని సమాధానాలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.