అనంతపురం నగరంలోని రెండో రోడ్ లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా కొన్ని హామీలే నెరవేర్చి అన్ని నెరవేర్చామని చెప్పుకుంటున్నారని అన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు నరసింహులు, చింతకుంట మధుసూదన్, కమల్, అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.