గుంటూరులో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పశ్చిమ డీఎస్పీ అరవింద్ హెచ్చరించారు. నగరంపాలెం, పట్టాభిపురం, అరండల్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి కేసుల్లో ఉన్న 51 మందికి ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు కూడా గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.