ములుగు జిల్లావ్యాప్తంగా రైతులు యూరియా కొరతతో తీవ ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి నర్సాపూర్, లక్ష్మీదేవి పేట పిఎసిఎస్ గోదాంల ఎదుట రైతులు భారీగా ఇరువు బస్తాల కోసం క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. సకాలంలో యూరియా అందక పంట నష్టం అవుతుందని రైతులు వాపోతున్నారు. పాలకులు మరియు అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.