సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ అంగన్వాడి కేంద్రం, బస్తి దవఖానను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులకు అందుతున్న పౌష్టికారమును పరిశీలించారు. బస్తీ దౌఖానాలు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. బస్తీ దవఖానాలు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వైద్య సిబ్బంది అంగన్వాడీలు ఆశాలు పాల్గొన్నారు.