పలమనేరు: పట్టణంలో ఉన్నటువంటి వంద పడకల ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు కుప్పం మెడికల్ సూపరిండెంట్ విజయ కుమారి. ఈ సందర్భంగా పలమనేరు ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ మమతా రాణి ఆమెకు సాదర స్వాగతం తెలిపారు. అనంతరం ఆసుపత్రిని తన బృందంతో కలిసి పరిశీలించిన విజయ్ కుమారి మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ్ ఆంధ్ర అవేర్నెస్ స్టేట్ అవార్డుల కొరకు, పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిని విసిట్ చేయడం జరిగింది, ముఖ్యంగా ఇక్కడ పారిశుద్ధ్యం, వైద్యం, శానిటేషన్, రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇలాంటి విషయాలను పరిశీలించడం జరిగిందన్నారు.