సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పనులను జిల్లా కలెక్టర్ కె. హైమవతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంలో ఐరన్ భారీ కేడింగ్, క్రేన్లు, ఐమాక్స్ లైట్లు, 108 వాహనం తో మెడికల్ క్యాంపు, అనౌన్స్మెంట్ చేయడానికి మైక్ అరేంజ్మెంట్, అలాగే పెద్ద విగ్రహాలకు విద్యుత్ తీగలు తగలకుండా ఏర్పాట్లు, ఎక్కువ సంఖ్యలో సిబ్బంది సమకూర్చుకొని నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యేదాక అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు. శాంతిభద్రతలకు భంగం కలవకుండా ట్రాఫిక్ డైవర్షన్ తో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల