ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు మాదిగ ఉద్యోగుల మరియు పదోన్నతుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాదిగ ఉద్యోగుల సంఘం మరియు ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు బొంత ఏసుదాసు మాదిగ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మాదిగ ఉద్యోగులు అంత ఐక్యత కలిగి సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అలాగే హైదరాబాదులో నిర్మించగలబెట్టిన జాంబవంతుని భవనం ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.