అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి వడ్డే రాము (37) చికిత్స పొందుతూ అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడని శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు బెలుగుప్ప ఎస్సై శివ పేర్కొన్నారు. కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన రాము అత్తగారి ఊరైన ఐదుకల్లుకు వెళుతూ బ్రాహ్మణపల్లి వద్ద డివైడర్ను ఢీకొని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతునికి భార్య మహాలక్ష్మి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. ఘటనపై బెళుగుప్ప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.