చంద్రశేఖరపురం మండల సిఐటియు 5వ మహాసభలు చంద్రశేఖరపురంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి మాట్లాడుతూ.... కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు పోరాటాల ఫలితంగానే రాష్ట్రంలో కార్మికులకు సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయన్నారు. గత సమ్మె కాలంలో కార్మికులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కొండారెడ్డి డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.