హిందూ దేవాలయాల ఆస్తులు పరిరక్షణే ధ్యేయంగా, హిందూ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని రాధా మనోహర్ దాస్ స్వామీజీ అన్నారు. బాబా గార్డెన్స్, వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ భరతమాత ఒడిలో హిందూ ధర్మంపై ఆధారపడి జీవిస్తున్నామని, హిందూ సాంప్రదాయ సంస్కృతులను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లిపోయినప్పటికీ వాళ్ళ వారసులు కొంతమంది ఇక్కడ ఉన్నారని, వారు భరత జాతిని చీల్చడానికి, సంపదను కొల్లగొట్టడానికి కుయుక్తులు చేస్తున్నందున, ఇప్పటికీ దేశంలో ఉన్న హిందువులు అభివృద్ధి చెందలేదన్నారు