కరీంనగర్ లో వైద్యం కోసం వస్తే రోగిపై అత్యాచారం చేసిన బాధ్యులను శిక్షించాలని గిరిజన సంఘం,డివైఎఫ్ఐ, ఏఐఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. పోలీసులు భారీగా మోహరించి ధర్నా చేసినా వారిని అక్కడి నుంచి పంపించే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. గిరిజన సంఘం తిరుపతి నాయక్ AIYF యుగంధర్, DYFI తిరుపతి మాట్లాడుతూ దీపిక ఆసుపత్రిలో పనిచేస్తున్న వ్యక్తి రోగికి మత్తుమందు ఇచ్చి అగత్యానికి పాల్పడ్డా వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో జాతీయ జరుగుతుందని ఆరోపించారు.ఆస్పత్రి పై, డాక్టర్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.