గణేష్ చతుర్థి సందర్భంగా బుధవారం వరంగల్ నగరంలోని భద్రకాళి టెంపుల్ ఆర్చ్ వద్ద గణనాధుల అమ్మకాలతో కోలాహలంగా మారింది. గత సంవత్సరంతో పోలిస్తే విగ్రహాలు ఎక్కువనే పెట్టినప్పటికీ రేట్లు మండిపోతున్నాయని గతానికి ఇప్పటికీ రేట్లు డబుల్ అయ్యాయని ఇటు నగర ప్రజలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న విగ్రహాలకు కూడా వందలు వేలు రేట్లు పెట్టారని మరోవైపు దేవుని వద్ద పెట్టే పత్రి ఆకులు 10-20 రూపాయలకు వచ్చేవని ఇప్పుడు అవి కూడా 50 రూపాయలకు తగ్గకుండా అమ్ముతున్నారని వాపోతున్నారు. మరోవైపు జలాశయాలు నీరు కలుషితం కాకుండా ఉండాలంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా విగ్రహాల తయారీదారులకు మట్టి ఫ్రీగా ఇవ్వాలని డిమా