యువతలో ఆధ్యాత్మికత భావన ను పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు. నగరంలోని కోర్టు రోడ్డు లో భక్తాంజనేయ స్వామి ఆలయంలో భాగవత్ పారాయణం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం అతిథిగా హాజరయ్యారు. ఆధ్యాత్మికత భావనలను పెద్ద ఎత్తున పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.