నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండల పరిధిలోని వైజాగ్ కాలనీకి హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన యువకుడు కృష్ణా నది తీరంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు. ఆదివారం ఉదయం కృష్ణా నది తీరంలో స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒక యువకుడు మృతి చెందాడు. వైజాగ్ కాలనీ కృష్ణా నది తీరం వద్ద పర్యవేక్షణ ఉండదని, గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని స్థానికులు చెప్తున్నారు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.