గంగవరం: మండల పోలీస్ స్టేషన్ వర్గాలు శుక్రవారం తెలిపిన సమాచారం మేరకు. కల్లుపల్లి వద్ద ఏపీ రిజిస్ట్రేషన్ గల స్కార్పియో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న మంజు అనే యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికుల సహాయంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కొరకు తరలించడం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారా, కేసు నమోదు చేశారా అనే విషయాలు పోలీసులు వెల్లడించాల్సిఉంది.