వడ్డెర సొసైటీల అభివృద్ధికి ముఖ్య మంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. శనివారం నల్లపాడు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్వారీల్లో పనిచేసే వడ్డెర కార్మికులకు భద్రతా పరికరాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈశ్వరరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వడ్డెర కార్పొరేషన్కు డైరెక్టర్లను నియమించడం శుభపరిణామమన్నారు.