బండి ఆత్మకూరు మండలం సింగవరానికి చెందిన కటికల పుష్ప రాజు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం పొలంలో కలుపు పనులు చేసుకుంటూ ఉండగా పొలానికి కొద్ది దూరంలో పిడుగు పడిందని, ఆ శబ్దానికి పుష్ప రాజు అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో, స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.