ఈనెల 27న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజలను కోరారు.మంగళవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ కోటిరెడ్డి సర్కిల్ వద్ద పర్యావరణ నియంత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి ఆయన చేతుల మీదుగా నగర ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు.