గ్రీన్ ఫీల్డ్ హైవేను ఆనుకుని ఉన్న పంట పొలాలకు వెళ్లేందుకు అవసరమైన దారులను చూపాలని రైతు సంఘం పాచిపెంట మండల నాయకుడు గంజి వసంతరావు, ఆదివాసి గిరిజన సంఘం నాయకుడు అభిమన్యుడు, సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై వారు మాట్లాడారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రైతులు భూములను ఇవ్వగా మిగిలిన పంటపొలాలలోనికి వెళ్లేందుకు వీలు లేకుండా రోడ్డుకు ఇరువైపులా సైడ్ వాల్ నిర్మించారన్నారు. దీంతో పంట పొలాలలోనికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.