అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎలమంచిలి పట్టణ ఎస్సై పాపినాయుడు తెలిపారు. ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో కసింకోట మండలం నరసింగబిల్లి గ్రామానికి చెందిన చిందాడ దొరబాబు నుంచి 19 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.