స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు పీడీ, పీఈటీలు సిద్ధం కావాలని జిల్లా సెక్రటరీ శ్రీనివాసరావు అన్నారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అన్ని మండల స్థాయి క్రీడా పోటీలను పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లాస్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు పీడీలు పాల్గొన్నారు.