ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని, భవిష్యత్తు అవసరాలను, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పాత వాటిని నవీకరించాలని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్.డి.ఎం.ఎ.) ప్రతినిధులు నావల్ ప్రకాశ్, అభిషేక్ బిశ్వాస్, అభినవ్ వాలియా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కొరకు, అధికారులతో సంప్రదింపులు చేసేందుకు బుధవారం జిల్లాకు విచ్చేసిన వారు ముందుగా జిల్లా కలెక్టర్ ను తన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా సమగ్ర ప్రణాళికలు, విపత్తుల నిర్వహణలో