AIPSU రాష్ట్రవ్యాప్తంగా '' సే నోటు'' డ్రగ్స్ అనే అంశం పై సెమినార్లు నిర్వహిస్తూ,విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కలిగిస్తూ,ఉద్యమాలు నిర్వహిస్తోందని AIPSU జిల్లా అధ్యక్షులు సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం బోధన్ లో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా AIPSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో "సే నో టు డ్రగ్స్" అనే అంశంపై అవగాహన సదస్సు ఈనెల 15వ తేదీన సోమవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ప్రధాన వక్త రాష్ట్ర కార్యదర్శి మన్నే కుమార్ పోలీసుల అధికారులు పాల్గొంటున్నారన్నారు.