చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నక్కబండలో కాపురం ఉంటున్న దంపతులు అప్సర్ భాషా, మాలీన బేగం, కటారి స్వప్న వద్ద. రెండు లక్షల రూపాయలు అప్పు చేశారు. వారానికి 20000 రూపాయలు చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. వర వారానికి కట్టవలసిన వడ్డీ చెల్లించలేదని కటారి స్వప్న తన అనుచరులతో కలిసి దంపతులపై దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడ్డ దంపతులను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వెలుగులో వచ్చింది.