Download Now Banner

This browser does not support the video element.

బోధన్: వినాయక నిమజ్జనంలో భాగంగా జిల్లాలో పర్యటించిన సిపి సాయి చైతన్య

Bodhan, Nizamabad | Sep 5, 2025
గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ భద్రతాపరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ పవిత్ర వేడుకను సురక్షితంగా శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆయన తెలియజేశారు. జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా బాసర, ఉమ్మడి బ్రిడ్జి,బోధన్,బోర్గాం తదితర ప్రదేశాలను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా,భక్తిశ్రద్ధలతో జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిందని సిపి సాయి చైతన్య సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us