కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం MLC ల బృందం పర్యటించిన విషయం తెలిసిందే. గత మూడు నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల, పంట నష్టాలు, ప్రాణనష్టాలు, జరిగాయని, వర్ష బీభత్సంతో నష్టపోయిన బాధితులను MLC విజయశాంతి వారిని పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు కేంద్రప్రభుత్వం సహకారం అవసరమని పేర్కొన్నారు. బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని MLC విజయశాంతి హామీ ఇచ్చారు.