రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈనెల 8వ తేదీన చలో కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సావనపల్లి బాలయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం కేంద్రంతో పాటు కేసీఆర్ నగర్, ఇందిరమ్మ కాలనీలలో వికలాంగులకు 6వేలు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు వ్యాధి, హెచ్ఐవి, క్యాన్సర్, వివిధ రకాల పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ15వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 25వందలు ఇవ్వాలని అన్నారు.