గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేవరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట డిఎస్పి ఎన్.లింగయ్య అన్నారు. శుక్రవారం ఐదున్నర గంటల సమయంలో పేట జిల్లా కేంద్రంలోని శిలా గార్డెన్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా వచ్చిన పోలీసు అధికారులకు సిబ్బందికి డిఎస్పి భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ పేట జిల్లా కేంద్రంలో సుమారు 120 గణపతులు నిమజ్జనానికి ఉన్న సందర్భంగా గణేష్ నిమజ్జనం సజవుగా జరిగేలా చూడాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అన్నారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.