సింగరేణి సంస్థలు పని చేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు 2024, 25 సంవత్సరానికి రావలసిన లాభాల వాటాను వెంటనే చెల్లించాలని బిఎంఎస్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మందమర్రి పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరానికి గాను 5,000 కోట్ల టర్నోవర్ వచ్చినట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించిందని, కార్మికులకు చెల్లించాల్సిన 5 వేల కోట్ల లాభాల వాటాను గడిచిన మార్చి, ఏప్రిల్ నెలలో చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు లాభాల వాటాను కార్మికులకు చెల్లించలేదని తెలిపారు.