భీమవరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ శుక్రవారం నిర్వహించనున్న సారధ్యం యాత్రను విజయవంతం చేయాలని బిజెపి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ శుక్రవారం భీమవరంలో సారధ్యం యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్ల పైన జిల్లా బిజెపి కార్యాలయంలో బిజెపి నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 7.45 గంటలకు డిఎన్ఆర్ గ్రౌండ్ వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమం, ఉదయం 9.30 గంటలకు స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమంలో పాల్గొంటారు అన్నారు.