తన కార్యాలయంలో పనిచేస్తున్న ఒక చిరు మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేశారన్న అభియోగాలపై తర్లుపాడు ఎంపీడీవో చక్రపాణిని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మంగళవారం సస్పెండ్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో ఇప్పటికే చక్రపాణి అరెస్టు కావడం తెలిసిందే. కలెక్టర్ కూడా శాఖాపరమైన విచారణ జరిపించి ఆ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు