మొతీలాల్ నగర్ ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే గృహాలు ఖాళీ చేయించాలని సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి అరుణ్ విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. తరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న వారిని ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదని చెప్పారు. ప్రత్యామ్నాయం చూపించకుంటే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజల పక్షాన సిపిఐ పోరాడుతుందని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.